DK Aruna: బడ్జెట్ స్పీచ్ లో రాష్ట్రాల పేర్ల ప్రస్తావన ఉండదు.. బడ్జెట్ పై డీకే అరుణ రియాక్షన్

by Prasad Jukanti |   ( Updated:2025-02-01 08:19:42.0  )
DK Aruna: బడ్జెట్ స్పీచ్ లో రాష్ట్రాల పేర్ల ప్రస్తావన ఉండదు.. బడ్జెట్ పై డీకే అరుణ  రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ (Union Budget 2025-26) తో ఇక మధ్యతరగతి జనానికి పండగే అని బీజేపీ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై స్పందించిన ఆమె ఇది అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. ట్యాక్స్ ఊరట కల్పించాలని జనం మాతో చెప్తుంటారు. ఇవాళ ఆ ఊరట కల్పించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. స్టార్టప్స్ పెట్టే వారికి కేంద్రం ప్రోత్సహకాలు ఇస్తున్నదన్నారు. నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ స్పీచ్ లో బిహార్ కు వరాల జల్లు కురిపించి తెలంగాణ (Telangana) ప్రస్తావన కూడా లేకపోవడంపై వస్తున్న విమర్శలపై డీకే అరుణ స్పందించారు. ఒక్కో రాష్ట్రాల ప్రస్తావన బడ్జెట్ స్పీచ్ లో ఉండదన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి తీసుకువచ్చే బడ్జెట్ ఇది అన్నారు. ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక సమస్య ఉంటే ఆ రాష్ట్రం పేరు ప్రస్తావిస్తారే తప్ప సాధారణంగా రాష్ట్రాల ప్రస్తావన రాదన్నారు.

Next Story

Most Viewed