బీజేపీ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: డీకే అరుణ

by GSrikanth |
బీజేపీ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని అప్పన్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కట్టడం చేతకాక కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీటిని అందించి తీరుతామన్నారు. అర్హులైన భార్యాభర్తలు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలమూరు యూనివర్సిటీతో పాటు ఏ ఒక్క యూనివర్సిటీలోనూ అడుగు పెట్టలేదు అని గుర్తు చేశారు. యూనివర్సిటీలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. విద్యార్థులకు సమాధానాలు చెప్పలేకనే సీఎం యూనివర్సిటీలలో అడుగుపెట్టడం లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గానీ పోలీస్ సెక్యూరిటీ లేకుండా పర్యటనలు చేయగల సత్తా ఈ ఉందా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు గుర్తించి వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, నాయకుడు వెంకటేష్, కౌన్సిలర్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed