Telangana Secretariat : సెక్రటేరియేట్ ముట్టడికి దివ్యాంగుల యత్నం.. ఉద్రిక్తత

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-21 05:50:25.0  )
Telangana Secretariat : సెక్రటేరియేట్ ముట్టడికి దివ్యాంగుల యత్నం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సెక్రటేరియేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలం ముట్టడికి దివ్యాంగులు యత్నించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు పెన్షన్ ఇవ్వడం లేదని దివ్యాంగులు సచివాలయం ముట్టడికి యత్నించారు. ఆందోళనకు దిగిన దివ్యాంగులను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరు పట్ల దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story