జహీరాబాద్ బరిలో దిల్ రాజు!.. సినీ నిర్మాతకు బీజేపీ గాలం?

by Prasad Jukanti |   ( Updated:2024-02-25 13:40:17.0  )
జహీరాబాద్ బరిలో దిల్ రాజు!.. సినీ నిర్మాతకు బీజేపీ గాలం?
X

దిశ, డైనమిక్ బ్యూరో : సినీ నిర్మాత దిల్ రాజు బీజేపీలో చేరబోతున్నారా?.. ఆయనను పార్టీ జహీరాబాద్ నుంచి లోక్‌సభ బరిలో నిలపనుందా? తాజాగా సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. కమలం కీలక నేతలు త్వరలోనే ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయమై ఫోకస్ పెట్టిన బీజేపీ త్వరలో 100 మందితో తొలి జాబితాను విడుదల చేయనుంది. అయితే దిల్ రాజు విషయంలో ఫస్ట్ లిస్ట్‌లోనే క్లారిటీ వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. కాగా తొలిజాబితాలో రాష్ట్రానికి చెందిన 12 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సికింద్రాబాద్ స్థానానికి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం.

పలు స్థానాలు పెండింగ్‌లో..

ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును మారుస్తారనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడ నగేశ్, రమేశ్ రాథోడ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. అలాగే మహబూబ్ నగర్ స్థానానికి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మహబూబ్‌బాద్ హుస్సేన్ నాయక్, కృష్ణవేణి నాయక్, మల్కాజ్ గిరి ఈటల రాజేందర్, మురళీధర్ రావు, నాగర్ కర్నూల్ రాములు, ఆయన కుమారుడు భరత్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, హైదరాబాద్ మాధవి లత, ఉమా మహేందర్, మెదక్ అంజిరెడ్డి, రఘునందన్ రావు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈనెల 29న జరగబోయే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తరువాత ఈ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది. 12 స్థానాల విషయంలో అధిష్టానం కసరత్తు చేస్తుంటే పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, ఖమ్మం, నల్లగొండ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.

Advertisement

Next Story