- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సీఎం సార్’ మా కుటుంబాలకు మమ్మల్ని దగ్గర చేయండి: మోడల్ స్కూల్ టీచర్ల ధర్నా
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం సార్.. మా కుటుంబాలకు మమ్మల్ని దగ్గర చేయండి అంటూ ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రిక్వెస్ట్ చేశారు. మోడల్ స్కూల్స్ లో టీచర్లకు బదిలీలు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో దాదాపు 194 మోడల్ స్కూల్లలో గత పదకొండు ఏళ్ల నుంచి బదిలీలు లేక స్వస్థలాలకు చాలా దూరంగా ఉద్యోగాలు చేస్తూ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని టీచర్లు ఆవేదన వ్యక్తంచేశారు. 2013లో పీజీటీ, టీజీటీలు ప్రిన్సిపాల్స్‌గా నియమించడి ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో పనిచేస్తూ బదిలీలు జరగక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
జోనల్ వ్యవస్థలో జిల్లాలు మారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తమ కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవనం చెల్లాచెదురైన పరిస్థిలో మానసిక ఒత్తిడికి, శారీరక ఒత్తిడికి లోనవుతూ చాలా దీన స్థితిలో ఉన్నామని టీచర్లు చెబుతున్నారు. ఎప్పటికైనా తమ కుటుంబాలతో కలిసి ఉంటామన్న ఆశతో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు టీ అరవింద్, శీనయ్య, కత్తి వెంకటస్వామి, ఇష్రాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.