- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీఆర్ఎస్వీ నాయకుల ధర్నా.. శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత
by Sathputhe Rajesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో : మాదాపూర్ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీ ప్రధాన కార్యాలయం ముందు భారత జాగృతి విద్యార్థి విభాగం నాయకులు ధర్నాకు దిగారు. ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి విద్యార్థి విభాగం నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సాత్విక్ మరణానికి కారణమైన శ్రీ చైతన్య విద్యాసంస్థలను వెంటనే రద్దు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని.. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story