అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు మద్దతుగా ధర్నా..

by Sathputhe Rajesh |
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు మద్దతుగా ధర్నా..
X

దిశ, సికింద్రాబాద్: క్యూ నెట్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు తోడుగా బీజీపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకి సంఘీభావం ప్రకటించి మద్దతుగా ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. క్యూ నెట్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి, సంస్థను రద్దు చేయాలని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపు కోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కుటుంబానికి ఒక ఉద్యోగంతో పాటు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. కూలీ నాలి చేసుకొని జీవించే బాధితుల నుండి లక్షల్లో వసూలు చేసిన క్యూ నెట్ యాజమాన్యం కూడా బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయినా వారిలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్‌, కాంగ్రెస్ పార్టీ డేటా జాతీయ కో అర్డి‌నేటర్ దీపక్‌జాన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story