మాపై చార్జిషీట్ వేసేంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదు.. ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
మాపై చార్జిషీట్ వేసేంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదు.. ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ చార్జిషీట్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిలో ఓటుకు నోటు కేసు భయం మొదలైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి స్పీచ్‌లల్లో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై చార్జిషీట్ వేసే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశాన్ని తాలిబన్‌ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోలేరు అన్నారు. 400 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణలోనూ 12 నుంచి 14 స్థానాల్లో సత్తా చాటుతామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలు ఒకటే అని.. ఇంటర్నల్‌గా కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed