Kodanda Reddy: కావాలనే KCR నిషేధిత జాబితాలో పెట్టారు

by Gantepaka Srikanth |
Kodanda Reddy: కావాలనే KCR నిషేధిత జాబితాలో పెట్టారు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా ప్రభుత్వమని.. ప్రజల సూచనలతోనే నిర్ణయాలు తీసుకుంటుందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల అభిప్రాయాలు తీసుకునే ముందుకు వెళ్తుందని అన్నారు. ఆనాడు ఇందిరా గాంధీ భూస్వామి పద్ధతి రాకూడదు అనుకుని భూ పంపిణీ ప్రారంభించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయంలో భూముల విషయంలో చాలా తప్పులు జరిగాయి. 2018లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడనికి పాస్ పుస్తకాలు ఇచ్చేశారు. తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా ఈ భూములను నిషేధంగా ఉంచారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను సమీక్షించి కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురాబోతుంది. భూముల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను సరిదిద్దుకోమన్నాం. ఇందిరా గాంధీ ఏ భూస్వామి పద్ధతి తొలగించాలి అనుకున్నారో ఆ పద్ధతి మళ్ళీ తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. కొత్త రెవెన్యూ చట్టం తీరుకురానున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతల నుండి మేధావుల నుండి, రెవెన్యూ నిపుణుల నుండి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులను రేవంత్ సర్కార్ సరిదిద్దుతోందని అన్నారు. ఇప్పటివరకు 2 లక్షల దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. ఆర్వోఆర్ చట్టం కింద ముసాయిదాను ఇప్పటికే సీఎంకు ఇచ్చినట్లు గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed