శివరాత్రి పండుగ వేళ పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
శివరాత్రి పండుగ వేళ పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నామని ఆ దిశగా పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు రాష్ర్ట డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ‘దిశ’ ప్రతినిధితో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా పోలీసు సిబ్బందికి విధి నిర్వహణపై ఇటీవల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. పోలీస్ శాఖలలో క్రీడలకు ప్ర్యతేకంగా ప్రాధాన్యత కల్గిస్తున్నట్లు, పోలీసులు క్రీడలలో రాణించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిచినట్లు తెలిపారు.

ఎస్ఎల్బీసీ ఘటనపై డీజీపీ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. సంఘటనా జరిగిన వెంటనే మహబూబ్ నగర్ ఎస్పీ స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. ఘటనలో చిక్కుకున్న వారి వివరాలు వెంటనే తెలుసుకోగలిగామని తెలిపారు. రెస్క్యూ ఏర్పాట్లపై పోలీసు శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా భక్తి శ్రధ్ధలతో జరుపుకునే మహశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed