- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఫోన్ కాల్స్ చాలా ఇంపార్టెంట్.. పోలీసులకు DGP కీలక సూచన
by Satheesh |
X
దిశ, క్రైమ్ బ్యూరో: డయల్ 100/112 ఫోన్ కాల్స్ పని తీరుపై డీజీపీ జితేందర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రజలకు సత్వర సేవలను అందించడంలో డయల్ 100/112 కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ఫోన్ కాల్స్ అందిన వెంటనే పోలీసులు సమర్ధవంతమైన సేవలను అందించాలని స్పష్టం చేశారు. ఈ సేవలను ఇంకా మెరుగైన సద్ధతిలో నిర్వహించేందుకు అధికారుల నుంచి సలహాలు, సూచనలను డీజీపీ తీసుకున్నారు. ప్రజలకు పోలీసుల పై విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసు అధికారులందరూ అత్యున్నత సప్రమాణాలను పాటించాలని డీజీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్, వివి శ్రీనివాస్ రావు, నగర జాయింట్ సీపీ పరిమళ హన నూతన్, ఐజీపీలు రమేష్, సత్యనారాయణ, ఇన్స్ పెక్టర్‌లు పాల్గొన్నారు.
Advertisement
Next Story