- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yadagirigutta: యాదగిరిగుట్టలో ఘనంగా శివ కేశవుల ఆరాధన
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకొని శివ కేశవుల ఆరాధన పూజలతో, భక్తుల రద్దీతో కిటకిటలాడింది. యాదగిరిగుట్ట కొండ పరిసరాలు భక్తజన సందడితో కిక్కిరిశాయి. కొండపైన శివ కేశవులను దర్శించుకుని.. వ్రతాలను నిర్వహించుకొని కార్తీక దీపారాధనలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించుకొని ప్రధాన ఆలయంలోని స్వామి వారిని దర్శించుకుని పులకించారు. అటు కార్తీక సోమవారం సందర్భంగా కొండపై కొలువైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ప్రధానాలయ క్యూలైన్లు కిక్కిరిశాయి.
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో పూజలు, నోములు ఆచరించి.. శివుడిని దర్శించుకుంటున్నారు. కొన్నిప్రాంతాల్లో కార్తీక దీపారాధన కార్యక్రమాలు జరుగుతుండగా.. వాటికి కూడా భక్తులు పోటెత్తారు. శివోహం.. హరహర మహాదేవ శంభోఃశంకర నామస్మరణలతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి.