ACB RAIDS: ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్

by Prasad Jukanti |   ( Updated:2024-08-23 13:38:06.0  )
ACB RAIDS: ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. లంచం తీసుకుంటూ హైదరాబాద్ నారాయణగూడ సర్కిల్ కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బి.వసంత ఇందిర రెడ్ హ్యాండెంట్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక వ్యక్తి ఖాతాల్లోని వ్యత్యాసాలను పట్టించుకోకుండా ఉండటం కోసం సదరు వ్యక్తి నుంచి ఇందిర వసంత రూ.35 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం ఆమెను ట్రాప్ చేసిన అధికారులు.. లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed