- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరినీ చీల్చుతావు..? కేసీఆర్‌పై డిప్యూటీ CM భట్టి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు విధానం లేదు అంటూ నిప్పులు చెరిగారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని ఇన్నాళ్లు ఆగామని.. ఇకపై కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యా్ఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎవరనీ చీల్చుతాడు.. ఏం చెండాడుతాడని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం అయిన కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడితే ఎలా అని.. పదేళ్లు మహిళలకు రుణాలు ఇవ్వలేని కేసీఆర్ ఇఫ్పుడు గాలి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవసాయానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తే.. మేం రైతుల సంక్షేమమే లక్ష్యంగా రూ.72 వేల కోట్లు పెట్టామని కౌంటర్ ఇచ్చారు.