- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు వచ్చే పైప్ లైన్‌కు రంధ్రం చేసి గజ్వేల్‌కు నీళ్లు: భట్టి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ అనంతరం సభ్యులకు రిప్లై ఇస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా నది నుండి హైదరాబాద్‌కు రెండు విడతల్లో తాగునీటి పైపు లైన్లు వేశామని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌కు నీళ్లు పైపు లైన్‌కు రంద్రం పెట్టి అప్పటి సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు నీళ్లు తీసుకెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓఆర్ఆర్‌పై 30 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారని, బీఆర్ఎస్ దిగిపోయే ముందు ఓఆర్ఆర్ వేలం వేసుకుని ఆదాయం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో భారీ పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితాలు బీఆర్ఎస్ హయాంలో కనిపించాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ చెప్పుకున్నది. కానీ అంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే పెట్టుబడులు వచ్చాయని అన్నారు.