- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DCM Bhatti: రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అమలుకు చర్యలు ప్రారంభించాం
దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal)తో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు కులగణనకు తాము తెలంగాణలో చర్యలు ప్రారంభించినట్లు కేసీ వేణుగోపాల్‌కు భట్టి వివరించారు. అంతేకాదు.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పుకొచ్చారు. కాగా, గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరి జనాభా ఎంతనో వారికంత వాటా ఉండాలని భావించారు. ఇదే విషయాన్ని అనేక బహిరంగసభల్లో చెబుతూ వచ్చారు. తాజాగా రాహుల్ ఇచ్చిన హామీని తెలంగాణలో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని భట్టి చెప్పుకొచ్చారు.