కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌

by Mahesh |
కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో కుల గణన సర్వే(cast Census Survey) చేయడానికి సర్వ సిద్ధం చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుల గణన సర్వే పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), సీఎస్‌ శాంతి కుమారి(CS Shanti Kumari), కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌(Video conference) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. కలెక్టర్లు, ఎన్యుమరేటర్స్‌తో విస్తృతంగా మాట్లాడాలని.. సర్వే చేస్తున్న ప్రాంతాల్లోని లోకల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో జరగుతున్న ఈ కులగణన కారణంగా దేశం మొత్తం తెలంగాణను గమనిస్తుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కాగా ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి మూడు రోజులు స్టిక్కర్లు అంటించారు. కాగా నేటి నుంచి కుటుంబాల వివరాలు సేకరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed