- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Deputy CM Bhatti: వాటికి ఇక భవిష్యత్తు లేదు.. కాలం చెల్లినట్లే
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం బొగ్గు తవ్వకాలకు మాత్రమే పరిమితమైన సింగరేణి సంస్థ ఇకపైన మెటల్స్, నాన్-మెటల్స్ రంగాల్లోకి అడుగు పెట్టాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా విస్తరణపై ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. పెట్రోలు, డీజిల్, బొగ్గు లాంటి సంప్రదాయ ఇంధన వనరులు క్రమేణా తగ్గిపోతున్నాయని, వాటికి ఇక భవిష్యత్తు లేదని, కాలం చెల్లినట్లేనని అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలన్నారు. లిథియం మైనింగ్ దిశగా కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సింగరేణి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికపై ఆ సంస్థ అధికారులతో సచివాలయంలో శనివారం జరిగిన సమీక్షలో పై విదంగా దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ ఇక విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు నుంచీ బొగ్గు మైనింగ్‌లో నిష్ణాతులైన సంస్థగా సింగరేణి గుర్తింపు పొందిందని, ఇప్పుడు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.
భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో లిథియం వంటి అనేక మూలకాల అన్వేషణ, వాటిని వెలికితీయడంపై సింగరేణి దృష్టి సారించాలన్నారు. సింగరేణి సంస్థ తన మనుగడను కొనసాగిస్తూనే ఆస్తులను, సంపదను సృష్టించుకోవాలని సూచించారు. అప్పుడే రాష్ట్ర ప్రజల సంపదగా ఉన్న సింగరేణి ఉద్యోగ-ఉపాధి అవకాశాలను కూడా కల్పించగలుగుతుందన్నారు. మెటల్స్, నాన్-మెటల్స్ మైనింగ్ కార్యకలాపాల్లో సింగరేణి సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్నారు. అవసరమైతే ఒక కన్సల్టెన్సీని నియమించుకోవాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. డీపీఆర్‌లను రూపొందిస్తున్నామని, త్వరలో ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.
ఒరిస్సాలోని నైని బ్లాకులో బొగ్గు ఎప్పటి నుంచి ఉత్పత్తి ఆరంభించనున్నదీ డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఉప ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ తదితరలు పాల్గొన్నారు.