- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Deputy CM Bhatti: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటే సమాజంలో బలమైన మార్పు సాధ్యమవుతుందని నొక్కిచెప్పిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఆ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గతంతో పోలిస్తే బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో పాటు విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడంపై స్వయంగా ముఖ్యమంత్రే ఫోకస్ పెట్టారని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఇందుకోసం రూ.5 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన డిప్యూటీ సీఎం ప్రసంగిస్తూ.. ఇందిరమ్మ రాజ్యానికి ఆయన ఆలోచనే స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ప్రజా ప్రభుత్వానికి ఆయన జీవితమే స్ఫూర్తి అని కొనియాడారు.
ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్లను నిర్మిస్తామని, అందులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. గత ప్రభుత్వంలో సర్కారు స్కూళ్ళు మూతబడితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దన్న ఉద్దేశంతో కొత్తవాటిని తెరిపిస్తున్నట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలన్న విజ్ఞప్తులు వచ్చాయని, దానికి ప్రభుత్వం సానుకూలగా ఉన్నదన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి, స్థలాన్ని ఎలా సేకరించాలి తదితర అంశాలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దానిపై స్పష్టమైన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వగానే కార్యరూపం దాల్చేలా తాను చొరవ తీసుకుంటానని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యానికి పాపన్న జీవితమే ఆదర్శమని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం.. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రజలు మెచ్చే పాలనను అందించడం, బడుగులకు అవకాశాలు ఇవ్వాలని ఆచరణ ద్వారా ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కుతుందన్నారు. ఆయన పుట్టిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రూ.4.70 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాపన్న జీవిత చరిత్రపై రూపొందించిన పాకెట్ బుక్కును ప్రతి గ్రామానికి పంపాలని, విరివిగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని భరోసా ఇచ్చారు. ఒక కూలీగా జమిందార్ వద్దకు చేరి సహచరులందర్నీ యుద్ధానికి సిద్ధం చేశారని, ఈ సమాచారం లీక్ కావడంతో జమీందారు అందర్నీ బంధిస్తే ఇబ్బందులకు తలవంచకుండా స్నేహితులనే సైనికులుగా మార్చి జమీందారు కోటలను పాపన్న జయించారని గుర్తుచేశారు. వరంగల్ కోటనే కాక గోల్కొండ కోటనూ జయించారని, జమిందార్లతో పోరాటం ప్రాణానికే ప్రమాదమంటూ తల్లి వారించినా ప్రజల కోసం సిద్ధపడ్డారని తెలిపారు.
హక్కులు, కోర్టులు, చట్టాలు లేని సమయంలోనే సర్వాయి పాపన్న ఎన్నో విజయాలు సాధించి స్ఫూర్తిగా నిలిచారని కీర్తించారు. సామాన్యులను కూడగట్టి సైనికులుగా తీర్చిదిద్దిన సర్దార్ పాపన్న... భారతదేశంలోనే బలమైన సైన్యం కలిగిన మొఘల్ చక్రవర్తులను ఓడించారని, సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆచరణ ద్వారా నిరూపించారని గుర్తుచేశారు.