- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. రేపే ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై కీలక చర్చ చేశారు. రేపు(సోమవారం) రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్‌ల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లాంఛనంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు పాల్గొననున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకం ఉండనుందని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడటానికి రాజీవ్ యువ పథకమే కారణమని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌లు ప్రితం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్ల కొత్వాల్ సహా అధికారులు పాల్గొన్నారు.
Read More..
ఆంధ్రా మూలాలుంటే ఆయన పేరు మార్చేస్తారా?.. కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ ఫైర్