Deputy CM Bhatti : ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

by Sathputhe Rajesh |
Deputy CM Bhatti : ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో నేడు రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా, ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరి భట్టి వెళ్లారు. మరికొద్ది సేపట్లో కేబినెట్ భేటీలో ఆయన పాల్గొననున్నారు. మంత్రి మండలి ఆమోదం కోసం అసెంబ్లీలో జరిగే కేబినెట్ సమావేశంలో 2024-25 వార్షిక బడ్జెట్ గురించి డిప్యూటీ సీఎం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story