దిశ కథనానికి స్పందించిన విద్యాశాఖ!

by Ramesh Goud |   ( Updated:2024-06-13 08:38:11.0  )
దిశ కథనానికి స్పందించిన విద్యాశాఖ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యాశాఖకు ఇంకా సీఎం కేసీఆరేనా?.. తెలుగు పాఠ్య పుస్తకాల్లో తప్పుగా ప్రచురణ, అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు అనే శీర్షికన బుధవారం దిశ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన విద్యాశాఖ తక్షణ చర్యలు చేపట్టింది. పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అవ్వడంతో విద్యాశాఖ అధికారులు, గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాల్లో ముందుమాట మార్చకుండా సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అని ముద్రించారు.

దీంతో ముందుమాట ఉన్న పేజీని చించేసి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్ల నుండి I నుండి X తరగతుల మొదటి భాష తెలుగు పాఠ్య పుస్తకాలను తక్షణమే సేకరించి ఎమ్మార్సీ వద్ద భద్రపరచాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పైన పేర్కొన్న పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసినప్పటికీ వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలిపింది. ఉదయం 10.30 గంటల వరకు 1 నుంచి పదో తరగతి ప్రథమ భాష తెలుగు పాఠ్య పుస్తకాలను ఎంఈఓలు హెచ్‌ఎంల నుంచి సీఆర్పీల ద్వారా వెనక్కి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed