- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రామ భక్తులకు షాక్.. రాజాసింగ్ శోభ యాత్రకు అనుమతి నిరాకరణ
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో జరిగే శోభాయాత్రకు దక్షిణ భారతదేశంలో గొప్ప పేరు ఉంది. అందులో ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించే రామనవమి శోభాయాత్రకు లక్షల సంఖ్యలో రామభక్తులు, హిందూ సంఘాల నేతలు పాల్గొంటారు. ఈ క్రమంలోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత వస్తున్న మొదటి రామనవమి కావడంతో హైదరాబాద్ పరిధిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో అన్ని హిందూ సంఘాల శోభ యాత్రలకు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అందుకు తగ్గట్టు ఏర్పాటు చేశారు. కాగా రాజా సింగ్ నిర్వహించే శోభాయాత్రకు మాత్రం పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టిపరిస్థితుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుతామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రాజాసింగ్ అభిమానులు, రామభక్తులు ఆకాశ్‌పూరి హనుమాన్ టెంపుల్ వద్దకు చేరుకున్నారు. దీంతో పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించినట్లు తెలుస్తుంది.