Revanth Reddy: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. రేవంత్ రెడ్డి పాత వీడియో వైరల్

by Prasad Jukanti |   ( Updated:2024-08-24 05:56:17.0  )
Revanth Reddy: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. రేవంత్ రెడ్డి పాత వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా ఏర్పాటైన హైడ్రా మరోసారి పంజా విసిరింది. తాజాగా శనివారం ఉదయం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై కొరడా ఝుళిపించింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు నడుమ ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. అయితే తాజా పరిణామంతో రేవంత్ రెడ్డి పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ప్రతిపక్షంలో ఉండగా 2016లో నాటి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడంపై సభలో ప్రస్తావించారు.

సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు అక్రమదారులు పడుతున్నారని, చెరువుకు అడ్డంగా గోడ కట్టి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను నిర్మించారని ఇది అక్రమ నిర్మాణం అని పదే పదే మీడియాలో కథనాలు వచ్చినా నాగార్జునకు సంబంధించి ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డు పడుతున్నది? ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారని సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైడ్రా రూపంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నేల మట్టం చేయడంతో రేవంత్ రెడ్డి పాత వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తూ రేవంత్ రెడ్డి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం అని ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో రేవంత్ రెడ్డిది నాడు నేడు ఒక్కడే మాట అంటూ నెటిజన్లు, కాంగ్రెస్ మద్దతుదారులు క్యాప్షన్లు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed