- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జనాభా ప్రతిపాదికన 2026 తర్వాత లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్‌తో తక్కువ లోక్ సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరం అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని ఇది దురదృష్టకరమన్నారు.
జనాభాను కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నియంత్రించాయని, తమ ప్రగతిశీల విధానాలకు శిక్షించబడుతున్నాయన్నారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని, కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయన్నారు. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్ సభ డిలిమిటేషన్ విధానంతో భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోవద్దన్నారు. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు గళమెత్తాలని పిలుపు నిచ్చారు.