- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DELHI: ముగిసిన సీఈసీ సమావేశం.. కాసేపట్లో టీ.కాంగ్రెస్ తొలి జాబితా
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో నేడు జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అయితే, కాసేపటి క్రితమే సీఈసీ సమవేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ సుధీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న అశావహుల జాబితాను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్ ముందుపెట్టారు.
9 మందితో తొలి జాబితా..
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అన్ని వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ కాసేపట్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితాలో కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, నల్గొండ నంచి జానారెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ సంపత్ లేదా మల్లు రవి పేర్లు ఉండే అవకాశం ఉంది.