సీబీఐతో అంత ఈజీ కాదు.. విచారణపై కవిత ఊగిసలాట!

by GSrikanth |   ( Updated:2022-12-06 03:07:18.0  )
సీబీఐతో అంత ఈజీ కాదు.. విచారణపై కవిత ఊగిసలాట!
X

లిక్కర్​స్కామ్‌లో సీబీఐ విచారణ ఎదుర్కోబోతున్న ఎమ్మెల్సీ కవిత అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. సీబీఐ విచారణ అంత ఈజీ కాదని.. అందుకే ఊగిసలాడుతున్నారా? అని కొంతమంది.. వాయిదాలు కూడా వ్యూహంలో భాగమేనని మరికొంతమంది చర్చించుకుంటున్నారు. సీబీఐ నుంచి లేఖ అందగానే విచారణకు సిద్ధమని చెప్పడం కూడా సరైందని కాదని న్యాయనిపుణులు సూచనలు చేయడంతోనే మాట మార్చారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా విచారణకు ముందు ఓకే చెప్పి.. ఆపై పేచీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఐ విచారణ విషయంలో ఎమ్మెల్సీ కవిత అనుసరిస్తున్న తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కేసును ఎదుర్కొనే విషయంలో ఆమె కన్ప్యూజన్ లో ఉన్నారా? అందుకే రోజుకో తీరుగా స్పందిస్తున్నారా? లేక స్ట్రాటజీలో భాగంగా సీబీఐకే పరీక్ష పెడుతున్నారా? అందుకోసమే ముందు విచారణకు సిద్ధమని చెప్పి, ఆతర్వాత వేరే పనులు ఉన్నాయని మాట మార్చారా? అనే చర్చ కొనసాగుతుంది. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా న్యాయనిపుణులతో పలు దఫాలుగా చర్చలు చేసిన తర్వాతే కవిత సీబీఐకి లేఖ రాశారు. తాను ముందుగా చెప్పిన తేదీలో కాకుండా ఇతర తేదీల్లో సాక్ష్యం చెప్పేందుకు రెడీగా ఉన్నట్టు వెల్లడించారు. ఒకవేళ వారు కాదు, కూడదు అని వస్తే లీగల్​గా ఎదుర్కొనేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.

ముందు ఒకే చెప్పి.. ఆ తర్వాత పేచీ

సాక్షిగా విచారణ చేసేందుకు సీబీఐ కవితకు లెటర్ రాసిన వెంటనే స్పందించారు. ఈ నెల 6న హైదరాబాద్​లోని తన ఇంట్లో విచారణకు సిద్ధమని లేఖ రాశారు. కానీ, తెల్లవారేసరికి వైఖరి మార్చుకుని ముందుగా లిక్కర్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కావాలని కోరారు. ఆ కాపీ సీబీఐ పోర్టల్ లో ఉందని ఆధికారులు స్పందించారు. కానీ కవిత మాత్రం ఆ కాపీలో నిందితుల పేర్లలో తన పేరు లేదని, కానీ సాక్ష్యం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అయితే 6వ తేదీన ఇతర పనులు ఉన్నందున ఆరోజు తనకు వీలు కాదని, ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణ కోసం తన ఇంటికి రావొచ్చని సీబీఐకి లేఖ రాశారు.

లీగల్ ఎక్స్​పర్ట్స్ సలహా మేరకే

సీబీఐ లేఖ రాసిన వెంటనే కవిత స్పందించి ఈ నెల 6వ తేదీన తాను సాక్ష్యం ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు లేఖ రాయడం సరైంది కాదని అభిప్రాయాన్ని లీగల్ ఎక్స్​పర్ట్స్ అభిప్రాయపడినట్టు తెలిసింది. దీంతో వెంటనే కవిత ఎఫ్ఐఆర్ కాపీ కావాలని కారణం చూపుతూ సీబీఐకి లేఖ రాశారు. ఒకవేళ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సీబీఐ ఆఫీసర్ల ఎదుట కూర్చుంటే సమాధానాలు ఇచ్చే విషయంలో కొంత కన్ఫ్యూజన్ లో పడే ప్రమాదం ఉంటుందని లీగల్ ఎక్స్​పర్ట్స్ అలర్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆమె ముందుగా చెప్పిన తేదీలో కాకుండా ఇతర తేదీల్లో విచారణకు సహకరిస్తానని లేఖ రాశారని ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి : కవిత పర్యటన ఖరారు.. CBI నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Advertisement

Next Story