ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : MLC కవితకు బిగ్ రిలీఫ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-26 08:04:20.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : MLC కవితకు బిగ్ రిలీఫ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20 వరకు లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించడం కానీ, అరెస్ట్ చేయడం కానీ చేయొద్దని సూచించింది. సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌పై విచారణను నవంబర్ 20 వరకు సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. నవంబర్‌ 20న తదుపరి విచారణ చేపడతామని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనం తెలిపింది.

అక్టోబర్‌ 18న పిఎంఎల్‌ఎ కేసులకు సంబంధించి... ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తెలిపారు. ఆ తరువాతే... విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీం కోర్టు తెలిపింది. కాగా కవితను నవంబర్ 20 వరకు విచారణకు పిలవబోమని ఈడీ తరపు న్యాయవాది ఎఎస్‌జి రాజు సుప్రీం కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ఈనెల 15న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అవే ఉత్తర్వులు కొనసాగుతాయని తాజాగా ధర్మాసానం పేర్కొంది. ఇక, ఇదే కేసులో వరకు కవితకు సమన్లు జారీ చేయబోమని ఈడీ కోర్టుకు తెలిపింది.

Read More : కేసీఆర్ కొంపముంచుతున్న ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన

Advertisement

Next Story

Most Viewed