తీహార్ జైలు నుంచే బాలీవుడ్ హీరోయిన్స్‌‌తో సుఖేశ్ డేటింగ్!

by GSrikanth |   ( Updated:2023-04-21 16:37:28.0  )
తీహార్ జైలు నుంచే బాలీవుడ్ హీరోయిన్స్‌‌తో సుఖేశ్ డేటింగ్!
X

దిశ, ఫీచర్స్: సుఖేష్ చంద్రశేఖర్.. ఒక్క నిమిషంలో ఎదుటి మనిషి జాతకాన్ని మార్చేయగలడు. రెండు నిమిషాల్లో తన గురించి తీర్పునివ్వబోతున్న న్యాయమూర్తి సైతం మానిప్యులేట్ చేయగలడు. చేశాడు కూడా. అలాంటి వ్యక్తికి బాలీవుడ్ హీరోయిన్స్‌తో రొమాంటిక్‌గా మాట్లాడాలనిపిస్తే.. కొద్ది రోజులు డేట్ చేసి ఎంజాయ్ చేయాలనిపిస్తే.. జడ్జీనే పడేసినోడికి ఇదో లెక్కా అనిపిస్తుంది కదా. ఎస్.. హండ్రెడ్ పర్సెంట్.. అదే చేశాడు. కెరీర్‌ పీక్స్‌కు తీసుకెళ్తానని అరచేతిలో స్వర్గం చూపించి అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ వర్కవుట్ చేశాడు. తాను ఎదుర్కొంటున్న రూ. 200 కోట్ల కుంభకోణం కేసులో వాళ్లనీ ఇన్వాల్వ్ చేశాడు.

తొలి వలపు.. లీనా

సుఖేశ్​ కన్నేసిన సినీతారల్లో లీనా మరియాపాల్‌ ముందు వరుసలో ఉన్నారు. మోహన్‌లాల్ మూవీ ‘రెడ్ చిల్లీస్’తో స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్న తనను టార్గెట్ చేసిన సుఖేష్.. ఆమె హాజరైన ఈవెంట్‌కు ఇరువైపులా సెక్యూరిటీ గార్డ్స్‌తో రిచ్ ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన పొలిటిషియన్ కొడుకు బాలాజీ అని అబద్ధం చెప్పి ఫ్రెండ్‌షిప్ పెంచుకున్నాడు. ఎలాంటి డౌట్ రాకముందే డేట్ చేసి పెళ్లి చేసుకున్నాడు.

జాక్వెలిన్ అందానికి ఫిదా

తీహార్ జైలులో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ నటి, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌పై సుఖేష్ కన్ను పడింది. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన పింకీ ఇరానీ సహాయంతో ఆ హీరోయిన్‌తో డేటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కేంద్ర హోంమంత్రి ఆఫీసునుంచి కాల్ చేస్తున్నట్లు డ్రామాలు చేసినా తొలుత జాక్వెలిన్​ నమ్మలేదు. చివరకు సుఖేశ్​ సన్ టీవీ యాజమాన్యం ఓనర్ అని, కోట్లకు అధిపతి అని పింకీ ఇరానీ ఇంట్రడ్యూజ్ చేయడంతోపాటు మలబార్ గోల్డ్ అంబాసిడర్ కాంట్రాక్ట్ ఓకే అయ్యేలా ప్లాన్ కూడా చేయడంతో తను నమ్మేసింది. ఆమె కోసం కోట్లు ఖరీదైన డైమండ్ రింగ్, బ్రాస్ లెట్స్, గుస్సీ బ్యాగ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్, ఫారిన్ క్యాట్స్, రూ. 57లక్షలు ఖరీదు చేసే గుర్రం బహుమతిగా అందించాడు.

నోరాతో డేటింగ్‌కు తహతహ

కెనడాకు చెందిన నోరా ఫతేహి బాలీవుడ్ ఐటెమ్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా మారిన తరుణంలో ఆమెతో స్నేహాన్ని పెంచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నైలోని చారిటీ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఆహ్వానించాడు. కానీ అక్కడి పరిస్థితులు కొంచెం తేడాగా ఉండటంతో నోరాకు అనుమానం వచ్చింది. ఇదే టైమ్‌లో లగ్జరీ కారు కూడా బహుమతిగా ఇవ్వబోయినా రెఫ్యూజ్ చేసిన నోరా.. తీసుకునేదాకా వదిలేడా లేడని తన కజిన్‌కు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత అతడికి నుంచి ఐఫోన్, లగ్జరీ బ్యాగ్స్ అందడం కామన్ అయిపోయింది.

చాహత్ ఖన్నాకు క్రేజీ ఆఫర్​

హిందీ సీరియల్​ యాక్ట్రెస్​గా సుపరిచితురాలైన చాహత్​ ఖన్నా విషయంలో సుఖేశ్​ మరీ వింతగా వ్యవహరించాడు. ఆమె భర్త ఫోన్​ను ట్యాప్​ చేసి.. తనతోనే ఉండాల్సిందిగా కోరాడని ఆమె స్వయంగా మీడియాకు తెలిపింది. అతడి వ్యవహారంతో గాభరా పడి.. దూరంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక అతడి కన్ను పడిన వారిలో బాలీవుడ్​ తారలు సోఫియా సింగ్, బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలితో పాటు మరో ప్రముఖ మోడల్‌ కూడా ఉన్నారు. జస్ట్ ఫోన్​కాల్ కోసం రూ. 5లక్షలు ఇస్తూ.. వెబ్ సిరీస్‌లు నిర్మించి ఒక ఫ్యాన్‌గా వాళ్ల కెరీర్‌ను బిగ్ స్టేజ్‌కు చేరుస్తానని ప్రామిస్ చేశాడు. ఈ తారలను తీహార్​ జైలులోనే సుఖేశ్​ కలుసుకోవడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి:

బెంగళూరు పోలీస్ కమిషనర్ to MLC కవిత.. సుఖేశ్ సక్సెస్ ‌ఫుల్ క్రైమ్ స్టోరీ!

Advertisement

Next Story