ఢిల్లీ లిక్కర్ స్కామ్ నరేంద్ర మోడీ సృష్టించిన ఓ పొలిటికల్ స్కామ్: KCR

by Anjali |
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నరేంద్ర మోడీ సృష్టించిన ఓ పొలిటికల్ స్కామ్: KCR
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నరేంద్ర మోడీ సృష్టించిన ఓ పొలిటికల్ స్కామ్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు వరకు స్కామ్‌లో ఒక్క రూపాయి రికవరీ చేయలే.. ఎవడి నుంచి ఎవడు తీసుకున్నడో ఎవరికి తెలవదని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించారన్నారు. తాను, అర్వింద్ కేజ్రీవాల్ మోడీ కంట్లో నలుసులాగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఆయన ఏజెంట్లను పంపించి గవర్నమెంటును కూలగొట్టాలని చూసిండని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన వాళ్లని పట్టి తాను ఇక్కడ జైలులో వేశానని తెలిపారు. వేయడమే కాకుండా ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బీఎల్ సంతోష్ ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్‌గా ఉన్నాడని.. ఆయనని పట్టుకు రావాలని తెలంగాణ పోలీసులని ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకు పంపించానని తెలిపారు. ఆ కోపం మనసులో పెట్టుకుని మమల్ని రాజీకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు అర్వింద్ కేజ్రీవాల్‌ను, ఇక్కడ కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వాళ్లు కడిగిన ముత్యంలా బైటకి వస్తారు.. అది స్కామ్ కాదు వట్టి ట్రాష్ అని కేసీఆర్ కొట్టిపారేశారు.

Advertisement

Next Story