- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్, కవితకు మళ్లీ షాక్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగింది. మంగళవారం వీరిద్దరిని తిహార్ జైలు నుంచి వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. వాదనల అనంతరం సెప్టెంబర్ 2వ తేదీకి కస్టడీకి పొడిగిచింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈనెల 20వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఇదిలా ఉండగా లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత, కేజ్రీవాల్‌కు కోర్టులు బెయిల్ ఇచ్చేందుకు తరచూ నిరాకరిస్తున్నాయి. కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. అవసరమైన బెయిల్ బాండ్ అందించనందున మళ్లీ రిమాండ్ ఖైదీగా తిహార్ జైలుకు రావాల్సి వచ్చింది. ఇటీవల.. బెయిల్ కోసం కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అయితే.. కవితకు మాత్రం అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు బెయిల్ రాకపోవటం గమనార్హం. ఈ కేసులో కవితది ప్రధాన పాత్ర అని అధికారులు ఆరోపిస్తుండటంతో.. న్యాయస్థానాలు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ వస్తున్నాయి.