Smita Sabharwal : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. IAS స్మితా సబర్వాల్ దిగ్భ్రాంతి

by Ramesh N |
Smita Sabharwal : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. IAS స్మితా సబర్వాల్ దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లో వరద నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోచింగ్ సెంటర్‌లకు / పోటీ పరీక్షల ఫ్యాక్టరీలకు, దూరపు మెట్రో నగరాలకు పంపుతున్నారు. ఈ పిల్లలు అసమానతలను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతుంటారు.. అని పేర్కొంది.

అయితే, ఢిల్లీ కోచింగ్‌సెంటర్‌ ప్రమాదంలో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మరణించడం నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. నిర్లక్ష్యం కారణంగా వారి విలువైన ప్రాణాలు పోతున్నాయని స్పష్టంచేశారు. ఈ సదర్భంగా అవసరమైన ఇన్‌ఫ్రా & సేఫ్టీ ప్రోటోకాల్‌లను పాటించాలని అన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో కోచింగ్ సెంటర్లను తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఘటనలో చనిపోయిన విద్యార్థులు తానియా సోని , శ్రేయ యాదవ్‌ , నవీన్‌ డాల్విన్‌ కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Next Story