- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Deepadas Munshi: దీపాదాస్ మున్షీ పిటిషన్ పై విచారణ వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) గతంలో చేసిన ఆరోపణలపై ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మున్షీ (Deepadas Munshi) దాఖలు చేసిన పరువు నష్టం కేసు పిటిషన్ ((Defamation Suit)) పై విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 5 కు నాంపల్లి కోర్టు (Nampally Court) వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణకు దీపాదాస్ మున్షీతో పాటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కేసులో ప్రభాకర్ పలుసార్లు కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ్టి విచారణకు తప్పక హాజరుకావాలని గతంలో ఆదేశించింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి విచారణకు ప్రభాకర్ హాజరయ్యారు. విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. కాగా గత లోక్ సభ ఎన్నికల సమయంలో దీపాదాస్ మున్షీపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పలు ఆరోపణలు చేశారు. ముడుపులు తీసుకుని ఎంపీ టికెట్లు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్షీ ప్రభాకర్ పై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.