- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'15 వేల ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి'
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి, వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ జరిగిన జరగకున్న వాటితో సంబంధం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. బుధవారం రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయం ముందు టీఆర్టీ అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నిరసనలు తెలిపారు.
టీఆర్టీ అభ్యర్థుల ముట్టడి నేపథ్యంలో ఉదయం నుండే కార్యాలయం ఎదుట పోలీసులు మోహరించారు. కార్యాలయం ముందు నిరసనల అనంతరం విద్యా శాఖ అదనపు సంచాలకులు లింగయ్య కి అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. గత సంవత్సరం జూన్ 12 న టెట్ నిర్వహించి 10 నెలలు గడిచినా టీఆర్టీ జారీ చేయకపోవడం వల్ల 4 లక్షల మంది అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారని అభ్యర్థులు పేర్కోన్నారు. అక్రమ స్పౌజ్ పోస్టులు రద్దు చేసి ఆ ఖాళీలను టీఆర్టీ నోటిఫికేషన్‌లో జత చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాను, ఇర్ఫాన్, హరీష్, నరేష్, కొటేష్, చంద్ర శేఖర్ రెడ్డి, సునీత, స్వప్న, నవ్య, టీఆర్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.