- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీకి ‘డిక్లరేషన్’ ఫియర్.. కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా స్కెచ్!
దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ పార్టీకి కాంగ్రెస్ డిక్లరేషన్ల భయం పట్టుకుంది. అవి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్న క్రమంలో అడ్డుకట్టవేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాటిని నమ్మితే మోసపోవడం ఖాయమని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ కేడర్‌కు నాయకులు మెసేజ్ ఇస్తున్నది. కాంగ్రెస్ ఎన్నడూ ప్రజల శ్రేయస్సును పట్టించుకోలేదనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నది. ఏ రాష్ట్రంలోనూ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని, తెలంగాణలోనూ చేయదనే విషయాన్ని వివరించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ డిక్లరేషన్‌లను ప్రకటిస్తున్నది. ఇప్పటికే మైనార్టీ, బీసీ డిక్లరేషన్లను అనౌన్స్ చేసింది. మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, బడ్జెట్‌లో 4 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో పాటు ఇమాం, మౌజాం, గ్రంథి, ఫాస్టర్లకు నెలకు ఇచ్చే వేతనం రూ. 10 వేల నుంచి 12 వేలకు పెంచుతామని, విద్యా, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల వర్తింపజేస్తామని తెలిపింది.
బీసీలకు 23 నుంచి 42 శాతం రిజ్వరేషన్ల పెంపు, కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 6 నెలల్లోనే రిజర్వేషన్ అమలు, బడ్జెట్‌లో ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయింపు, విద్య కోసం రూ. 10 లక్షల వరకు పూచీకత్తులేకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఈ విషయాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీంతో బీఆర్‌ఎస్ అలర్ట్ అయింది. ఈ డిక్లరేషన్లు ప్రజల్లోకి వెళ్తే తనకు నష్టమనే భావనకు వచ్చి అడ్డుకట్ట వేసే ప్లాన్ చేస్తున్నది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నది. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలను వివరించి, మళ్లీ వస్తే జరిగే నష్టాలను ప్రత్యక్షంగాను, సోషల్ మీడియా వేదికగానూ ప్రజలకు చెప్పాలని సూచనలు చేస్తున్నది.
వైఫల్యాలపై ఫోకస్
కాంగ్రెస్ వైఫల్యాలపైనే గులాబీ పార్టీ ప్రధాన ఫోకస్ పెట్టింది. కర్నాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అక్కడి రైతులు కరెంటు కోసం సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారని, బస్సులో ఉచిత ప్రయాణం ఆటకెక్కిందని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని, తెలంగాణలో కూడా డిక్లరేషన్లను అమలు చేయదనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని పార్టీ కేడర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
ఓట్లకోసమే ఇదంతా చేస్తున్నారంటూ మీడియా ముఖంగా సైతం వివరించాలని సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గోసపడతాం, అభివృద్ధి, సంక్షేమం కుంటుపడతాయనే విషయాలను విస్తృతంగా ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్ అధిష్టానం కేడర్‌కు సూచిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ డిక్లరేషన్‌తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ తనదైనశైలీలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.