దశాబ్ది ఉత్సవాల వేళ వినూత్న నిరసనకు కాంగ్రెస్ శ్రీకారం

by Rajesh |   ( Updated:2023-06-22 05:51:09.0  )
దశాబ్ది ఉత్సవాల వేళ వినూత్న నిరసనకు కాంగ్రెస్ శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ‘దశాబ్ది దగా’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయాల వ్యవహారాల కమిటీ (పిఏసీ)‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు నిర్ణయించారు.

దీంతో అన్ని నియోజక వర్గ కేంద్రాలలో ‘దశాబ్ది దగా’ పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మ‌ను రావణాసురుడిలాగా తయారు చేసి పది తలలు ఏర్పాటు చేసి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన చేయనున్నారు. అనంతరం వాటిని దగ్ధం చేయనున్నారు. తర్వాత ఆర్డీఓ,ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపు ఇచ్చారు. కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ఆయా పథకాల బాధిత ప్రజలు ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని నాయకులంతా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు.

ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రభుత్వ వైఫల్యాలు ఇవే..

కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య

ఫీజ్ రీయంబర్స్ మెంట్

ఇంటికో ఉద్యోగం

నిరుద్యోగ భృతి

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి

పోడు భూములకు పట్టాలు

రైతు రుణ మాఫీ

12 శాతం ముస్లిం రిజర్వేషన్లు

12 శాతం గిరిజన రిజర్వేషన్లు

Advertisement

Next Story