- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏది తెలంగాణ పునర్మిర్మాణం.. సీఎం కేసీఆర్‌కు నెటిజన్ల సూటి ప్రశ్నలు!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డాక్టర్ బీఆర్ఎస్ అంబేద్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు సైతం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కాలు పెట్టని సీఎం కొత్తగా నిర్మించుకుని మరీ అడుగు పెట్టారు. అనంతరం ప్రసంగించారు. తెలంగాణ పునర్నిర్మాణంపై అద్భుతంగా మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాడక ముందు బంగారు తెలంగాణ, ఆ తర్వాత గుణాత్మకమైన మార్పు, ఇప్పుడు తెలంగాణ పునర్మిర్మాణం అంటూ ఉదరగొట్టేశారు. అయితే పునర్మిర్మాణమనే మాట మాత్రం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, తెలంగాణకు సీఎం కొత్త సెక్రటేరియట్ నిర్మించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలపై మాత్రం ఎలాంటి హామీలు ఇవ్వలేదు. పైగా పునర్మిర్మాణం అద్భుతం అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ పరువు తీస్తున్నాయి. పలువరు నెటిజన్లు, బీఎస్పీకి చెందిన పలువురు కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిస్తున్నారు. తెలంగాణ పునర్మిర్మాణంలో సీఎం కేసీఆర్ ఏమేమి చేయలేకపోతున్నారో వాటన్నింటినీ పాయింట్ అవుట్ చేసి మరీ నిలదీస్తు్న్నారు. ప్రధానంగా రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నల దాడి చేస్తున్నారు. తెలంగాణ పునర్మిర్మాణమంటే ఇదే అంటూ అని ట్వీట్స్ చేస్తున్నారు.
‘రైతులు పంటనష్టం పరిహారం ఇవ్వలేకపోవడమే?. రాళ్ల వానకు పంటనష్టం అవడమే హరిత క్రాంతి. ఎకరాకు 10వేలు రూపాయలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. ఆనాడు పాములు, తేలు కాటుకు సావులు అయితే నేడు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారెందరో చెప్పండి. పొరుగు రాష్ట్ర కూలీలు వస్తే.. ఈ రాష్ట్ర కూలీలు బిచ్చమెత్తుకోవడమే. 30 లక్షల నిరుద్యోగులు గోసపడటమే. కూలగొట్టడం కట్టి కాంట్రాక్టర్లు కోట్లు కుమ్మరించడమే. ఈ విధంగా చాలా రకాల్లో అన్ని విధాలుగా లక్షల కోట్ల పెట్టుబడులు దోచుకోవడమే?. ఎక్కడికక్కడ ప్రశ్నించే వారిని లోపలేసినందుకే?, సికింద్రాబాద్‌లో మౌనిక మురికి కాలువలో పడి చనిపోవడమే. ఎంజీఎంలో ఎలుకలు కరవడమే. ఇంటికో ఉద్యోగం ఇస్తే 20 వేలు ఇవ్వాల్సి వస్తుందని ఇంటికో 2వేలు ఇవ్వడమే. శాంతాడంత కష్టాలున్న తెలంగాణ గోసలే.’ తెలంగాణ పునర్నిర్మాణం అంటూ ప్రశ్నిస్తున్నారు.
అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఐదేళ్లలో పాలనలో రాజకీయంగా సీఎం కేసీఆర్ కొన్ని ఓడిదుడుకులకు పాల్పడ్డారు. అయినా సరే తెలంగాణ ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు. కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి నుంచి ఫలితాలు కూడా సాధించారు. యాదాద్రి పునర్మిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్రంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం లాంటివి జరిగాయి. అయితే చాలా హామీలు, సమస్యలపై దృష్టి సారించలేదు. ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరాటం చేసినా అవేవి పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. తాజాగా ఇన్ని ప్రశ్నల వర్షం కురిపించినా ఏం పట్టించుకుంటారో చూడాలి.