వైర్‌మెన్ సూపర్ వైజర్ అప్లికేషన్ల గడువు పొడిగించాలి : తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్

by M.Rajitha |
వైర్‌మెన్ సూపర్ వైజర్ అప్లికేషన్ల గడువు పొడిగించాలి : తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైర్ మెన్ సూపర్ వైజర్ అప్లికేషన్ల గడువును పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య, ఎలక్ట్రికల్ లైసెన్స్ ఇన్ బోర్డ్ కార్యదర్శి టీ కాంతారావుకు బుధవార వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. వరుస సెలవుల నేపథ్యంలో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అభ్యర్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్ తేదీ గడువు పెంచాలని కోరారు. స్పందించిన కార్యదర్శి ఈ నెల 23 వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వైర్ మెన్ సూపర్ వైజర్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఈనెల 23 నుంచి వారం రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి వెల్లడించారు. వివరాలకు 7989349899 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు సభ్యుడు నేమాల బెనర్జి, కందుకూరి మహేశ్, వినోద్ రావు, సత్యనారాయణ, రాంరెడ్డి. నరేంద్ర చారి, సుధాకర్, చింతల రాము, ఊరు పక్క నరేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed