‘తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు’.. వారికి మరో అవకాశం ఇచ్చిన సర్కార్

by Gantepaka Srikanth |
‘తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు’.. వారికి మరో అవకాశం ఇచ్చిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు(New Liquor Brands) అందుబాటులోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీర్లు(Beers), లిక్కర్‌(Liquor) అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(TGBCL) ఇచ్చిన నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పటివరకు దాదాపు 39 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత నెల 24న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా దరఖాస్తులకు గడువు పెంచింది. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానిస్తోంది. గతంలో మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లు దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇచ్చేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వమే నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొత్త కంపెనీలే కాకుండా ఇప్పటికే మద్యాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలు కూడా కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీజీబీసీఎల్‌ పేర్కొంది. మరోవైపు ఇటీవలే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచారు.

Next Story

Most Viewed