ప్రవళిక సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన డీసీపీ వెంకటేశ్వర్లు..!

by Satheesh |   ( Updated:2023-10-14 12:45:14.0  )
ప్రవళిక సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయం బయటపెట్టిన డీసీపీ వెంకటేశ్వర్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక.. పేపర్ లీక్స్, వరుసగా పరీక్షలు వాయిదా పడటంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ప్రవళిక ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో ప్రవళిక ఆత్మహత్య గల కారణాలను సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలిపారు.

శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రవళిక ప్రేమలో ఉందని.. ప్రవళిక ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసన్నారు. శివరామ్‌కు ఈ మధ్య మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ప్రవళిక మృతికి, పరీక్షల వాయిదాకి అసలు సంబంధమే లేదని క్లారిటీ ఇచ్చారు. 15 రోజుల క్రితమే హస్టల్‌లో జాయిన్ అయ్యిందని.. ప్రవళిక చివరగా శివరామ్ రాథోడ్‌తో ఫోన్ మాట్లాడిందని తెలిపారు. ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ దొరికిందని.. ఆ లెటర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని పేర్కొన్నారు. రిపోర్ట్ ఆధారంగా శివరామ్‌పై చర్యలు ఉంటాయని తెలిపారు.

Advertisement

Next Story