దయానంద్ దారెటు? పొంగులేటి అనుచరుల్లో టెన్షన్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-04 03:50:11.0  )
దయానంద్ దారెటు? పొంగులేటి అనుచరుల్లో టెన్షన్
X

దిశ, కల్లూరు : చైతన్యవంతమైన రాజకీయాలకు వేదికగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో పొంగులేటి అనుచరులలో ఆందోళన నెలకొన్నది. 13 సంవత్సరాలుగా పొంగులేటి వెంట నడిచిన డాక్టర్ మట్టా దయానంద్ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. మొదటి నుంచి క్షేత్రస్థాయిలో అనుచరుల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మట్టా దయానంద్. ఒక దశలో కొత్తగూడెం టిక్కెట్ పొంగులేటికి కన్ఫర్మ్ అయింది బీఆర్ఎస్ నుంచి అని, అదే సమయంలో సత్తుపల్లి టిక్కెట్ బీఆర్ఎస్ నుంచి దయానంద్‌కు రాదు కాబట్టి దయానంద్‌ను కాంగ్రెస్ నుంచి పోటీ చేయించాలని నాయకులు, అభిమానులు, కొంత ఒత్తిడి కూడా చేసినట్టు ప్రచారం జరిగింది.

ఇప్పుడేమో అలా కాదు నా మీద నమ్మకంతో, పూర్తిగా నా మీద భరోసా ఉంచి రావాలి ఏ పార్టీకైనా అనే ధోరణిలో పొంగులేటి వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి మధ్య దూరానికి కారణం ఇదేనా మరి ఇంకేమైనా ఉందా? తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన మువ్వ విజయబాబు, వైయస్సార్ పార్టీ నుంచి వచ్చిన పొంగులేటి, దయానంద్ పరస్పర విరుద్ధ భావజాలాలతో ఉన్న పార్టీల నేపథ్యం కూడా ఒక కారణమైతే, సమన్వయం చేయటంలో విజయబాబు విఫలమయ్యారని కొంతమంది మండల నాయకులు బాహాటంగానే చెబుతున్నారు.

ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పొంగులేటి నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాను అంటున్నారు డాక్టర్ దయానంద్. ఇంకా దయానంద్ వస్తారని ఎదురు చూస్తున్నట్టుగానే ఉన్నారు. ఒకవేళ రాకపోతే బలమైన ప్రత్యామ్నాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పొంగులేటి. కాలం త్వరగా తిరిగి రావాలి ఈ కన్ఫ్యూజన్ పోవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అనుచరుల మనసుల్లో పార్టీ -కాంగ్రెస్ అయి, అభ్యర్థి -మట్టా దయానంద్ అయితేనే మనం గెలవగలము అని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతారాయ్ సత్తుపల్లిలో సీటు కోసం పోటీ పడుతున్నారు. మరి దయానంద్ పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది...?

Also Read..

బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి KCR రెడీ.. త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్..?!

Advertisement

Next Story