T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా విందు రాజకీయాలు.. ఆ మూడు జిల్లాల్లో కంప్లీట్

by Prasad Jukanti |
T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా విందు రాజకీయాలు.. ఆ మూడు జిల్లాల్లో కంప్లీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) విందు రాజకీయాలు (Dinner Politics) ఆసక్తిగా మారాయి. మంత్రులు (Ministers), ఎమ్మెల్యేల (MLA) మధ్య సమన్వయం లేదనే చర్చ ఇటీవల పార్టీలో గుప్పుమంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి చెక్ పెట్టి వీరి మధ్య సఖ్యత పెంచేలా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విందు ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచన చేశారట. ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేకుంటే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని హెచ్చరించారట. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే రకమైన ఫలితాలు పార్టీకి ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారట. దీంతో ఎమ్మెల్యేలకు మంత్రులు దావత్ లు స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యేలకు విందు కార్యక్రమాలు పూర్తికాగా మిగతా జిల్లాల్లోనూ ఈ మీటింగ్ లకు మంత్రులు రెడీ అవుతున్నారు.

గ్యాప్ లేకుండా ప్రయత్నాలు:

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Election Results)కాంగ్రెస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి త్వరలో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. దీంతో ఆశావహులు ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తారని తొలుత అందరూ భావించారు. కానీ స్థానికంగా నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా చాలా మంది క్షేత్రస్థాయిలో పని చేయలేదనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న గ్యాప్ క్షేత్రస్థాయిలో ప్రభావం చూపిందనే చర్చ జరుగుతున్నది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పార్టీకి భారీగా డ్యామేజ్ తప్పదనే అంచనాతో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయిలో క్యాడర్ ను సమన్వయం చేసుకునేందుకు ఈ దావత్ పాలిటిక్స్ ఉపయోగపడతాయని హస్తం పార్టీ లెక్కలు వేసుకుంటోంది.

Next Story

Most Viewed