- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేగవంతమైన డేటా ఎంట్రీ.. అర్థరాత్రి వరకు డ్యూటీలు చేస్తున్న ఆపరేటర్లు
దిశ, సిటీబ్యూరో: సర్కారు ప్రకటించిన గ్యారెంటీల అమలుకు లబ్దిదారులను గుర్తించేందుకు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ వేగవంతమైంది. సర్వర్ డౌన్ సమస్యలను ఎదుర్కొన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు డేటా ఎంట్రీని స్పీడప్ చేశారు. కానీ మొదటి రెండు రోజుల్లో నెమ్మదిగా సాగిన డేటా ఎంట్రీ ప్రక్రియను జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. డేటా ఎంట్రీ ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సర్కారు డెడ్‌లైన్ విధించింది. డేటా ఎంట్రీ చేసేందుకు ఏర్పాటు చేసిన సుమారు 635 సెంటర్లలో ఈ ప్రక్రియ ఆశించిన వేగంగా జరగటంతో గడువులోపే పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. రెండో శనివారం, ఆదివారం, సోమవారం సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నప్పటికీ డేటా ఎంట్రీ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం.
రోజుకు 2 నుంచి 3 లక్షల దరఖాస్తులు..
డిసెంబర్ 28 నుంచి 6వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 24 లక్షల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. డేటా ఎంట్రీ ప్రారంభమైన మొదటి రెండు రోజుల పాటు ఒక్కో దరఖాస్తును అప్‌లోడ్ చేసేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. ఆ తర్వాత మూడో రోజు నుంచి ప్రక్రియ గాడీనపడింది. ప్రస్తుతం రోజుకు కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 3 లక్షల దరఖాస్తులను ఆపరేటర్లు అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న వేగవంతమైన ప్రక్రియ ద్వారా 24 లక్షల పైచిలుకు దరఖాస్తులను అప్‌లోడ్ చేసేందుకు దాదాపు 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. రోజువారీ అప్‌లోడ్ చేస్తున్న దరఖాస్తుల సంఖ్యను బట్టి సర్కారు ముందుగానే విధించిన గడువు ఈ నెల 17 తేదీ కల్లా డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.