దానం నాగేందర్‌ను కేసీఆర్ కన్న కొడుకులా చూసుకున్నారు: దాసోజు

by Disha Web Desk 2 |
దానం నాగేందర్‌ను కేసీఆర్ కన్న కొడుకులా చూసుకున్నారు: దాసోజు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై దానం నాగేందర్ చేసిన కామెంట్స్‌కు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ సందర్భంగా దాసోజు కౌంటర్ ఇస్తూ.. దానం నాగేందర్‌ను కేసీఆర్ కన్న కొడుకులా చూసుకున్నారని చెప్పారు. కేసీఆర్ గొప్ప నాయకుడు అంటూనే దానం బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. నాడు బీసీలకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన దానం మళ్లీ అదే పార్టీలో చేరయం అన్యాయం అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో తానేప్పుడు అవమానపడలేదని దాసోజు శ్రవణ్ చెప్పారు. కేవలం టికెట్ రాలేదన్న కారణంగానే పార్టీ మారానని అన్నారు. బీఆర్ఎస్‌లో కంటే వందలరెట్లు ఎక్కువ అవమానం కాంగ్రెస్‌లో ఎదుర్కొన్నట్లు తెలిపారు.


Next Story