Danam Nagender: ‘దానం’పై సీనియర్లు సీరియస్..! హైకమాండ్‌కు ఫిర్యాదు

by Shiva |
Danam Nagender: ‘దానం’పై సీనియర్లు సీరియస్..! హైకమాండ్‌కు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపై హస్తం లీడర్లు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన వ్యవహరశైలీ తో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అదే టైంలో సీఎం రేవంత్‌కు సైతం చికాకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. దానం, ఆయన అనుచరులు కొనసాగిస్తోన్న యాక్టివిటీస్, వాటికి సంబంధించి ఆధారాలను సైతం ఢిల్లీ పెద్దలకు పంపినట్లు తెలుస్తోంది. రూలింగ్ పార్టీలో ఉన్నంత మాత్రాన అధికారులపై పెత్తనం చెలాయిస్తే ఎలా? అని సీనియర్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు ప్రభుత్వం భూ దందాలు, ఆక్రమణలకు అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటే దానం మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ టైంలో సైతం దానం తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని, నాడు తెలంగాణ ప్రాంత లీడర్లు సొంత రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే దానం మాత్రం తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేశారని గుర్తుచేస్తున్నారు. రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే పట్టించుకోకుండా బీఆర్ఎస్ లోకి వెళ్లారని ఆరోపిస్తున్నారు. పార్టీ పవర్‌లోకి వచ్చిన తరువాత సొంత గూటికి వచ్చిన నాగేందర్‌కు ఎంపీగా పోటీచేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం ఖైరతాబాద్‌లోనే దానంకు మెజార్టీ రాలేదని లీడర్లు విమర్శిస్తున్నారు.

Next Story