Musi River Development : మూసీ నిర్వాసితులకు అనుమానాలొద్దు : దాన కిషోర్

by M.Rajitha |
Musi River Development : మూసీ నిర్వాసితులకు అనుమానాలొద్దు : దాన కిషోర్
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ(Musi) రివర్ సుందరీకరణలో భాగంగా రివర్ బెడ్లో గల 1600 నిర్మాణాలను మంగళవారం అధికారులు గుర్తించారు. అయితే మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులవుతున్న వారికి ఎలాంటి అనుమానాలొద్దని, వారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ హామీ ఇచ్చారు. నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు నిర్వాసితులవుతున్న ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కేటాయించామని పేర్కొన్నారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందుకోసం ప్రత్యేకంగా మంజూరు చేశామని తెలియజేశారు. అందరికీ పునరావాసం కల్పించిన తర్వాతనే రివర్ బెడ్లోని నిర్మాణాల తొలగింపు చేపడతామని అన్నారు. భూసేకరణకు సంబంధించి పునరావాస చట్టాల ప్రకారం పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతపాదనలు పంపించామని, ప్రభుత్వం అందరికీ నష్టపరిహారం అందించాకే భూసేకరణ పనులు మొదలు పెడతామని దాన కిషోర్ వివరించారు.

Next Story

Most Viewed