మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు

by Sridhar Babu |
మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు
X

దిశ, శంషాబాద్ : మూసీ పరీవాహక ప్రాంతంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపునకు వివరాలు సేకరిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలో మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి, అక్రమ నిర్మాణాల తొలగింపు పై జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్, రాజేందర్ నగర్ మండలాల్లోని మూసీ పరీవాహక ప్రాంతాలలో మొత్తం 332 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టు తెలిపారు. గండిపేట్ మండలంలో 32 నిర్మాణాలు, రాజేంద్రనగర్ మండలంలో 300 మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని, వాటిని తొలగిస్తామని చెప్పారు. వీరికి మరొకచోట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించనున్నట్టు తెలిపారు.

మొదట నాలుగు బృందాలను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న వారికి నచ్చజెప్పాలని సూచించారు. ఇంటి యజమానికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇంటికి సంబంధించి పేపర్లు, కరెంట్ బిల్లు, అనుమతులు తదితర డాటాను సేకరించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డ్రా తీసి కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇళ్లు ఖాళీ చేయించు సమయంలో రవాణా ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ ఎండీ గౌతమి, రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, మూసీ రివర్ డెవలపర్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, రాజేంద్రనగర్ మున్సిపల్ కమిషనర్ రవికుమార్, నార్సింగ్ మున్సిపల్ అధికారులు, రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు, నాలుగు బృందాల డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed