Health Tips: వర్క్- పర్సనల్ లైఫ్.. రెండింటి మధ్య నలిగిపోతున్నారా ? బెస్ట్ టిప్స్ మీ కోసమే

by Anjali |
Health Tips: వర్క్- పర్సనల్ లైఫ్.. రెండింటి మధ్య నలిగిపోతున్నారా ? బెస్ట్ టిప్స్ మీ కోసమే
X

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా మానవ జీవితంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరైన సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం, కంటినిండా నిద్రలేకపోవడం, బంధువులతో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వకపోవడం, ఇంట్లో భార్య పిల్లలతో గడపకపోవడం.. వీటన్నింటికి కారణం పని ఒత్తిడి అని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఈ ఒత్తిడి పని మీద పడుతుంది. ప్రజెంట్ డేస్ లో ఆఫస్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య సమతుల్యతను కాపాడుకోవడం అందరికీ సవాల్ గా మారింది.

ముఖ్యంగా మనిషి ముందుగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే వ్యక్తి హెల్తీగా ఉండగలుగుతాడు. లేకపోతే స్ట్రెస్ పెరుగుతుంది. దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్న వారు అవుతారు. రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాగా స్ట్రెస్ తగ్గించి.. బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేయాలంటే నిపుణులు చెప్పిన ఈ బెస్ట్ టిప్స్ పాటించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి..

వర్క్ అండ్ వక్తిగత లైఫ్ బ్యాలెన్స్ కోసం ముందుగా టైమింగ్ ను ఫాలో అవ్వాలి. సరైన సమయ నిర్వహణ ఉండాలి. వర్క్ కు ఇంపార్టెన్స్ ఇస్తూనే.. మీ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఒక టైమ్ లో చేయాలనుకుంది.. అదే సమయానికి చేసేయాలి. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వ్యాయామం చేయండి..

ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్ట్రెస్ తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గడమే కాకుండా శరీరాన్ని హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తుంది. కాగా ధ్యానం, యోగా ఈజీ వ్యాయామం చేయడం మంచిది. ఇవి చేయడం వల్ల బాడీలో శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి.

నిద్ర తప్పనిసరి..

మనిషి ప్రతిరోజూ తప్పకుండా 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. లేకపోతే మరుసటి రోజు నీరసంగా అయిపోయి.. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

విరామం తీసుకోండి..

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పని మధ్యలో చిన్నపాటి విరామం తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే ఎక్కువసేపు అదేపనిగా వర్క్ చేయడం వల్ల అలసిపోతారు. అలాగే ఒత్తిడి పెరుగుతుంది. ఏకాగ్రత ఉండదు. కాగా బ్రేక్ తీసుకుంటే మానసిక అలసటను తగ్గించి.. మరింత ఇంట్రెస్ట్ ను తెప్పిస్తుంది. కాగా ఉత్సాహంతో పని చేసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి..

ప్రతి వ్యక్తికి హెల్తీ ఫుడ్ చాలా అవసరం. ఆహారపు అలవాట్లు కూడా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తాయి. కాగా ప్రోటీన్లు, ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోండి. పోషకాలు అధికంగా ఉండే పాలు, గుడ్లు, ఆకుకూరలు తినడం వల్ల ఒత్తిడి సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీంతో శరీరం అండ్ మనస్సు రెండింటినీ హెల్తీగా ఉంచుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed