- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్యామిట్.. అడ్డం తిరిగిన కేసీఆర్ 'నేషనల్' స్కెచ్!
దిశ, డైనమిక్ బ్యూరో:జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే టార్గెట్ అంటూ దూసుకొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల వేళ సైలెంట్ అయ్యారు. తెలంగాణలో అధికారంలో ఉండగా పాన్ ఇండియా లెవల్ లో పార్టీని విస్తరిస్తామని చెప్పి హడావిడి చేసిన గులాబీ బాస్ అధికారానికి దూరం కాగానే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నా పక్క రాష్ట్రమైన ఏపీలో సత్తాచాటుతామంటూ బయలుదేరిన కేసీఆర్.. ఆ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేతులెత్తేయబోతున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం వరుస ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న కేసీఆర్ ఆ సెంటిమెంట్ భయంతోనే ఏపీలో అభ్యర్థులను ప్రకటించడం లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
అధ్యక్షుడు ఉన్నా అభ్యర్థులేరి?:
ఏపీలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దృష్టి సారించాయి. అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తుంటే అక్కడ బీఆర్ఎస్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా అభ్యర్థులు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ సొంత రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలని కేసీఆర్ భావించింది. అనుకున్నదే తడువుగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఎవరు ముందుకు వచ్చినా కండువాలు కప్పుతూ వారిని ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రతినిధులుగా పేర్కొంటూ హడావుడి చేశారు.ఈ క్రమంలో ఏపీలో నూ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించింది. తోట చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత కొంత కాలం బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై ఏపీ రాజకీయాల్లో చర్చ సాగింది. మహారష్ట్రలో మాదిరిగానే ఏపీలో కేసీఆర్ బహిరంగ సభ పెడతారనే చర్చ జరిగింది. కానీ అది జరగలేదు. ఈ క్రమంలో రావెల కిశోర్ వంటి కీలక నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. ఏపీలో కేసీఆర్ కార్యచరణ ఏమీ ప్రకటించకపోవడంతో కొన్నాళ్లకే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఉన్న మిగతా నేతలు సైతం తలోదారి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ మొదలు పెట్టిన నేషనల్ పాలిటిక్స్ మూన్నాళ్ల ముచ్చటేనా? ఏపీలో గులాబీ పార్టీ చాప్టర్ ఇక క్లోజ్ అయినట్లేనా అనే చర్చ జోరుగా జరుగుతోంది.
ముందు నుయ్యి వెనుక గొయ్యి:
తెలంగాణలో అధికారంలో ఉండగా కేసీఆర్ నిర్ణయాలకు అంతా చెల్లుబాటు అయ్యేది. కానీ అధికారం కోల్పోయాక పరిస్థితి అంతా తారుమారైంది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఏపీకి చెందిన లీడర్లు బీఆర్ఎస్ కు రాం రాం పలుకుతున్నారు. గతంలో తెలంగాణ అభివృద్ధికి ఏపీ అభివృద్ధికి మధ్య పోలికలు చూపి పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇక్కడ అధికారం కోల్పోగానే అక్కడ సైలెంట్ అయిపోయారు. కనీసం ఆ రాష్ట్రంలో అడుగుపెట్టడం కాదు కదా ఆ స్టేట్ శాఖ గురించి మాటైనా ప్రస్తావించకపోవడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తెలంగాణ సెంటిమెంట్ వ్యవహారం భగ్గుమంటోంది. కృష్ణాజలాల అంశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి కేటాయింపుల్లో దోషులు మీరంటే మీరే అని ఈ ఇరుపార్టీలు డైలాగ్ వార్ కు తెరలేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు అంటూ మళ్లీ ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇక పార్టీ పేరు మార్చడం వల్ల తెలంగాణలో అధికారానికి దూరం అయ్యామనే విశ్లేషణలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్లు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే ఇక ఏపీలో మనుగడ దాదాపు కష్టమే అని గ్రహించే కేసీఆర్ సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది.