- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘తోలు తీస్తా కొడకల్లారా?’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో రెచ్చిపోయిన దానం
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో హైదరాబాద్ నగర పరిస్థితిపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోల చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్.. ‘మీరు ఇలాగే ప్రవర్తిస్తే హైదరాబాద్‌లో తిరగనియ్య కొడకల్లారా.. తోలు తీస్తా’ అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు.. నాటకాలు ఆడుతుతున్నారా? అంటూ ఆవేశంగా మాట్లాడారు. దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు.
ఇది మంచి సంప్రదాయం కాదని.. తక్షణమే దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కవ్వించారు. అయినా పరిధిలోనే మాట్లాడాను. నేను మాట్లాడిన మాటలు సభలోని సభ్యులకు బాధ కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆ పదాలు సర్వసాధారంగా వస్తుంటాయి. గతంలో నేను ఎప్పుడు నోరు జారలేదు. సబ్జెట్ మీద మాట్లాడుతుంటే వాళ్లే నన్ను దూషించారు. చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అన్నది కేటీఆర్. అయినా నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ అడుగుతున్నా’’ అని దానం నాగేందర్ అక్బరుద్దీన్ డిమాండ్‌కు స్పందించారు. అంతకుముందు తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.